యిర్మీయా 44:12 - పవిత్ర బైబిల్12 యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు. အခန်းကိုကြည့်ပါ။ |
యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభవించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు.