యిర్మీయా 43:11 - పవిత్ర బైబిల్11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగు లునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీ యులను హతముచేయును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။ |
‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగవచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు: “‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాతబడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను. వారు కరువుకు గురవుతారు. మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపోబడతారు.
యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు.
నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉపసంహరించుకుంటాను.