యిర్మీయా 40:9 - పవిత్ర బైబిల్9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను–మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |