యిర్మీయా 4:2 - పవిత్ర బైబిల్2 నీవు ఆ విధంగా చేస్తే, నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు ‘నిత్యుడైన యెహోవా తోడు’ అని నీవనగలవు నీవీ మాటలు సత్యమైన, న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు. నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు. యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సత్యమునుబట్టియు న్యాయమునుబట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే, జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.” အခန်းကိုကြည့်ပါ။ |
ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించమని భూమిని వేడుకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు ఆశీర్వాదాలకోసం నమ్మకమైన దేవుణ్ణి అడుగుతారు. ఇప్పుడు ప్రజలు ప్రమాణాలు చేసినప్పుడు వారు భూశక్తిని నమ్ముకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకొంటారు. ఎందుకంటే గతంలోని కష్టాలు మరువబడుతాయి గనుక. ఆ కష్టాలను నాప్రజలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు.
కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను.
అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము. యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.
ఈ రాత్రికి నీవు ఇక్కడ ఉండు. అతను నీకేమైనా సహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలుసు కుందాము. నీకు సహాయము చేయటానికి అతను నిర్ణయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి అతను నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక నేనే నిన్ను పెళ్లాడి ఎలీమెలెకు భూమిని నీ కోసము మళ్లీ కొని యిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే వరకు ఇక్కడే పడుకో.”