యిర్మీయా 37:10 - పవిత్ర బైబిల్10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 మీతో యుద్ధం చేసే కల్దీయుల సైన్యమంతటినీ మీరు హతం చేసి వాళ్ళల్లో గాయపడిన వాళ్ళను మాత్రమే మిగిల్చినా, వాళ్ళే తమ గుడారాల్లోనుంచి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీపై దాడి చేస్తున్న బబులోనీయుల సైన్యం మొత్తాన్ని మీరు ఓడించినా, గాయపడిన మనుష్యులు మాత్రమే తమ గుడారాల్లో మిగిలిపోయినా, వారే బయటకు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీపై దాడి చేస్తున్న బబులోనీయుల సైన్యం మొత్తాన్ని మీరు ఓడించినా, గాయపడిన మనుష్యులు మాత్రమే తమ గుడారాల్లో మిగిలిపోయినా, వారే బయటకు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు.” အခန်းကိုကြည့်ပါ။ |
కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది.
బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా పన్నిన పధకాన్ని వినండి. కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా ఏమి చేయ నిర్ణయించాడో వినండి. “శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను) తిరిగి తీసికొంటాడు. ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు. ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు. జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.