యిర్మీయా 35:6 - పవిత్ర బైబిల్6 కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం త్రాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని త్రాగము. అతని ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారు–మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబు–మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాని వాళ్ళు “మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు, ‘మీరు గానీ మీ సంతానం గానీ ఎప్పుడూ ద్రాక్షారసం తాగకూడదు,’ అని మాకు ఆజ్ఞాపించాడు గనక, మేం ద్రాక్షారసం తాగం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు. အခန်းကိုကြည့်ပါ။ |
అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకోవాలని యెహోనాదాబు వెళ్లుచున్నాడు. యెహూ యెహోనాదాబును అభినందించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు. “నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు. “అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు. తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.
“రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం త్రాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం త్రాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు.
కాని నాతో ఇలా అన్నాడు: ‘నీవు గర్భవతివి. నీకొక కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర ఘాటైన పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే ఆహారమూ తినవద్దు. ఎందుకంటే, ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. ఆ బాలుడు దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి మరణించేంత వరకు అతను విలక్షణమైన మనిషి.’”