యిర్మీయా 35:17 - పవిత్ర బైబిల్17 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదావారిమీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, నేను వాళ్ళతో మాట్లాడాను గాని వాళ్ళు వినలేదు. నేను వాళ్ళను పిలిచాను గాని వాళ్ళు పలకలేదు. గనుక యూదా, యెరూషలేము నివాసులందరి మీదకీ తీసుకొస్తానని నేను చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ” အခန်းကိုကြည့်ပါ။ |
నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు. నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు. నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా? మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది. చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది! అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.
కానీ మీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాకరించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించుకోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించుకొన్నారు.”
కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను. అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం. నేను ఆ ప్రజలను పిలిచాను కాని వారు వినిపించుకోలేదు. నేను వారితో మాట్లాడాను కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను. నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు. నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”
కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.’”