యిర్మీయా 34:7 - పవిత్ర బైబిల్7 అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద, మిగతా యూదా పట్టాణాలన్నిటి మీద, ప్రాకారాలు కలిగిన పట్టణాలైన లాకీషు, అజేకా మీద దండెత్తింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే. အခန်းကိုကြည့်ပါ။ |
యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపని పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.
యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన క్రింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.