Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 34:21 - పవిత్ర బైబిల్

21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్లిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 “నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 “నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 34:21
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు.


యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు.


(యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు.


కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు.


రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు.


నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరోహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు. ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”


రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు.


కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు.


మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా రాజును వారు తమ గోతిలో పట్టుకున్నారు. రాజు యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి. “మేము ఆయన నీడలో నివసిస్తాము; ప్రపంచ రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసిస్తాము,” అని మేము మా రాజును గురించి చెప్పుకున్నాము.


“ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి పక్షిరాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు.


నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవ ప్రమాణంగా ఈ క్రొత్త రాజు బబులోనులో చనిపోతాడని నిశ్చయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని ఇతడు నెబుకద్నెజరుకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ క్రొత్తరాజు ఒడంబడికను నిరాకరించి విడిచి పెట్టాడు.


నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ