యిర్మీయా 34:15 - పవిత్ర బైబిల్15 కొద్ది కాలంక్రిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొనియొక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 “మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు. మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు. అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు. ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు. వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు. దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.