యిర్మీయా 33:6 - పవిత్ర బైబిల్6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 –నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు. అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు. ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు. వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు. ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
యెహోవా చెబుతున్నాడు: “చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు. మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు. బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు. అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు. ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు. జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు. వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!