యిర్మీయా 32:29 - పవిత్ర బైబిల్29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఈ పట్టణం మీద యుద్ధం చేసే కల్దీయులు వచ్చి, ఈ పట్టణానికి నిప్పంటించి, ఏ మిద్దెల మీదైతే ప్రజలు బయలుకు ధూపార్పణ చేసి అన్యదేవుళ్ళకు పానార్పణలు అర్పించి నన్ను రెచ్చగొట్టారో ఆ మిద్దెలన్నిటినీ కాల్చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
“‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు పారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’