యిర్మీయా 32:28 - పవిత్ర బైబిల్28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు –ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను; అతడు దాని పట్టుకొనగా အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “చూడు, నేను ఈ పట్టణాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోనీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోనీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. အခန်းကိုကြည့်ပါ။ |
అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు. బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
“మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.