యిర్మీయా 3:4 - పవిత్ర బైబిల్4 కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు. ‘నా తండ్రీ’ నా బాల్యంనుండి ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’ အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అయినను ఇప్పుడు నీవు–నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు, အခန်းကိုကြည့်ပါ။ |
ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు. ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు. కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు, ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.
“పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. మరి మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు. కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.
“మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీకరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు. ఆమె నీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు.