Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 29:16 - పవిత్ర బైబిల్

16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజునుగూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 29:16
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు.


ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.


“కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు.


బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.


కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ