యిర్మీయా 27:7 - పవిత్ర బైబిల్7 దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |
యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన క్రింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.
నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరోహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు. ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”
యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.