యిర్మీయా 22:28 - పవిత్ర బైబిల్28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది. ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు. యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు? వారెందుకు అన్య దేశానికి తోయబడతారు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? యెహోయాకీను పనికిమాలిన కుండా? అతన్నీ అతని సంతానాన్నీ తమకు తెలియని దేశంలోకి వాళ్ళెందుకు తోసేశారు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు? အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.)