Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 22:23 - పవిత్ర బైబిల్

23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు. ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది. కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు సురక్షితం అనుకుంటున్నావు. కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు. స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 22:23
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.” కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.


యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే: “గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను. నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.


నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు. వారు బహు దుష్టులైనారు! వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.


మోయాబు ప్రజలారా, మీ పట్టణాలను వదిలిపెట్టండి. వెళ్లి గుట్టల్లో నివసించండి. గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”


ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను క్రిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.


వారికి ఇలా చెప్పు: “‘పెను రెక్కల గ్రద్ద ఒకటి లెబానోనుకు వచ్చింది. మచ్చలుగల ఈకలు ఆ గ్రద్దకు మెండుగా ఉన్నాయి.


ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు నాకోసం వారు వెదుకుతూ వచ్చేంత వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును, తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”


అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.


వారు పాతాళం లోపలికి పోయినా నేను వారిని అక్కడనుండి బయటకు లాగుతాను. వారు ఆకాశంలోకి దూసుకుపోతే, నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.


దేవుడైన యెహోవా ఇది చెప్పాడు: “నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా, నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా, అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను


“అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవటాన్ని తను ఆపగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది.


తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు: “మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం. ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ