యిర్మీయా 22:20 - పవిత్ర బైబిల్20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 లెబానోను పర్వతాలు ఎక్కి కేకలు వెయ్యి. బాషానులో నీ గొంతు పెద్దది చెయ్యి. అబారీము పర్వతాలనుంచి కేకలు వెయ్యి. ఎందుకంటే నీ స్నేహితులంతా నాశనమవుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |
మీకు సహాయం అవసరమైనప్పుడు మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి. అయితే, వాటినన్నింటినీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను. ఒక్క గాలి విసురు వాటినన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది. అయితే నా మీద ఆధారపడే వ్యక్తి భూమిని సంపాదించుకొంటాడు. ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”
అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు.
“ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే, ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు! ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది. యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు. మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?” అని యెహోవా పలికాడు.