యిర్మీయా 21:7 - పవిత్ర బైబిల్7 అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’ အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఆ తరువాత యూదా దేశపు రాజు సిద్కియానూ అతని ఉద్యోగులనూ తెగులును, కత్తిని, కరువును తప్పించుకున్న మిగిలిన ప్రజలనూ బబులోను రాజు నెబుకద్నెజరు చేతికీ వారి ప్రాణాలను తీయాలని చూసేవాళ్ళ శత్రువుల చేతికీ అప్పగిస్తాను. అతడు వారి మీద కనికరం, జాలి ఏమీ చూపక వారిని కత్తితో చంపేస్తాడు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’ အခန်းကိုကြည့်ပါ။ |
యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు.
యిర్మీయా, యూదా రాజైన యెహోయాకీముకు ఈ విషయం కూడా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు వ్రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు చెప్పాడు?” అని నీవు అన్నావు.