యిర్మీయా 21:12 - పవిత్ర బైబిల్12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక ఇది జరుగుతుంది.’ အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |
ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి. మీ హృదయాలను మార్చుకోండి యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”