యిర్మీయా 20:8 - పవిత్ర బైబిల్8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి, హేళనచేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో. నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో. ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు. వారికి తగిన శిక్ష విధించుము. ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు. వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు. నా గురించి ఆలోచించుము. యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
“‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
వారు దేవునికి వ్యతిరేకులైనారు. అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది. ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది. వారి నగరాల దాపున ఒక చిరుతపులి పొంచి ఉంది. నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుతపులి చీల్చి చెండాడుతుంది. యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది. అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.