యిర్మీయా 20:11 - పవిత్ర బైబిల్11 కాని యెహోవా నాతో వున్నాడు. యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు. కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు. వారు నన్ను ఓడించలేరు. వారి ప్రయత్నం వ్యర్థం. వారు ఆశా భంగం చెందుతారు. వారు అవమానం పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో. నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో. ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు. వారికి తగిన శిక్ష విధించుము. ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు. వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు. నా గురించి ఆలోచించుము. యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.