Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 2:36 - పవిత్ర బైబిల్

36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 2:36
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదా ప్రజలను ఓడించారు. ఎదోమీయులు ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజైన ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థించాడు.


ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”


యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది? లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.


“యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’ నీవెలా నాకు చెప్పగలవు? లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో. నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో. నీవొక వడిగల ఆడ ఒంటివలె ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.


“యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు. కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.


“యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.


యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది. అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది. ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు. కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి. అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది. నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.


నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు. కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు? “నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహోవా సృష్టించినప్పుడు ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.”


“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది.


నీ రోదనను దేశాలు వింటాయి. నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది. ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు. ఆ యోధులిద్దరూ కలిసి క్రింద పడతారు.”


మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము. మా కావలి బురుజులపై నుండి మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.


మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము. తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.


పిమ్మట నీ కామవాంఛ తీర్చుకోవటానికి నీవు అష్షూరు వెళ్లావు. అక్కడ నీ వాంఛ తీరలేదు. నీకు అసలు తృప్తి అనేది లేదు.


ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు. కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది. వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు. కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”


అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది.


“ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.”


అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”


ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయంకోసం అష్షూరు వెళ్లారు. తమ సమస్యలనుగూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు. కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.


కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజిప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ