యిర్మీయా 2:32 - పవిత్ర బైబిల్32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఒక కన్య తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్ళికూతురు తన మేలిముసుగులు మర్చిపోతుందా? అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |
యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు.