యిర్మీయా 2:13 - పవిత్ర బైబిల్13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు: వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. (వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.) కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు. အခန်းကိုကြည့်ပါ။ |
మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని పట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.
నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్ననుసరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు.