యిర్మీయా 17:8 - పవిత్ర బైబిల్8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు. ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.” အခန်းကိုကြည့်ပါ။ |
దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.
అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.”