యిర్మీయా 17:18 - పవిత్ర బైబిల్18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు. వారిని సిగ్గుపడేలాచేయి. కాని నాకు ఆశాభంగం కలుగచేయకుము. ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము. కాని నన్ను మాత్రం పారిపోనీయవద్దు. ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము. వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులు పడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నన్ను హింసించేవారు అవమానించబడాలి, కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. వారికి భయభ్రాంతులు కలగాలి, కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నన్ను హింసించేవారు అవమానించబడాలి, కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. వారికి భయభ్రాంతులు కలగాలి, కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి. အခန်းကိုကြည့်ပါ။ |
యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”