యిర్మీయా 15:19 - పవిత్ర బైబిల్19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే నిన్ను నేను శిక్షించను. నీవు మారి నావద్దకు వస్తే నీవు నన్ను వెంబడించగలవు. వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే నాగురించి నీవు మాట్లాడగలవు. యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి. అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు. အခန်းကိုကြည့်ပါ။ |
“నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
“యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల చేశారు. వారు వాటిని ముఖ్యమైనవిగా పరిగణించరు. పవిత్ర వస్తువులను అతి సామాన్యమైనవిగా చూస్తారు. శుభ్రమైన వస్తువులను వారు మురికైనవిగా చూస్తారు. ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించబడ్డాను.