యిర్మీయా 15:18 - పవిత్ర బైబిల్18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు. నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు. యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను. నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు. నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది. အခန်းကိုကြည့်ပါ။ |
యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.