యిర్మీయా 14:22 - పవిత్ర బైబిల్22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు. ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు. నీవే మాకు దిక్కు నీవే ఈ కార్యములన్నీ జరిపించేది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవేగదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయుచున్నావు; నీకొరకే మేముకనిపెట్టుచున్నాము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే. အခန်းကိုကြည့်ပါ။ |
వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు. వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు. ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులనుండి రక్షిస్తాడు. ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు. వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.
దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు. పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు. నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను. ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను. నా కోపం అగ్నిని రాజబెట్టింది; నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని, దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది. నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.