Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 13:18 - పవిత్ర బైబిల్

18 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి: “మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి. మీ అందాల కిరీటాలు మీ తలలనుండి క్రిందికి పడిపోయాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము–మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 13:18
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.


నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు.


మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు


మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో వ్రాయబడ్డాయి.


తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు.


మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు.


ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.


ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు.


రుమాళ్లు, పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు,


పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.


“కల్దీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.


“యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను!


నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు.


(రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది)


గ్రంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.”


సీయోను కుమార్తె అందం మాయమయ్యింది. ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు. గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు. శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు. తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.


యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.


సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు. వారు కింద కూర్చుండి మౌనం వహించారు. వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు. వారు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు దుఃఖంతో తమ తలలు కిందికి వంచుకున్నారు.


మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.


నీకు ముక్కుపుడక, చెవికి దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసివేయి! మార్పుకు సమయం ఆసన్నమయ్యింది. ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మానవులు ప్రముఖ వ్యక్తులౌతారు.


కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చనిపోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”


మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు.


వారు నార పాగాలను తమ తలలపై ధరిస్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు నారబట్టలే ఉపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే బట్టలేవీ వారు ధరించరు.


“కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది.


ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు తీసివేసి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు.


అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.


ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.


అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ