యిర్మీయా 12:5 - పవిత్ర బైబిల్5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా? အခန်းကိုကြည့်ပါ။ |
రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కోలేకపోయారు.
“యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నిసార్లు సింహం వస్తూఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”
యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది. ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది. అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమికొడతాను! ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు. నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”