వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.”
“కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను. వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది. ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది. గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు. వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను. ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.” ఇదే యెహోవా వాక్కు.
ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకొనివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు.
ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
ప్రజలు భయపడి పారిపోతారు. పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు. ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే అతడు ఉరిలో చిక్కుకుంటాడు. మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.” ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. “ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు. వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి. వారినినరకబడనివ్వండి. వారు ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది. వారు శిక్షింపబడే సమయంవచ్చింది.
సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగు చేయుము నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”
ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు. అందరితో పాటు వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’” ఇది యెహోవా వాక్కు.
“ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు.
యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. యోసేపు సంతతివారు మంటలా తయారవుతారు. కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది. యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లపొద కంటే చాలా కంటకుడై ఉంటాడు. నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు. నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు!