Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 1:13 - పవిత్ర బైబిల్

13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?” “నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై–నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను–మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 రెండోసారి యెహోవా వాక్కు నాకు కనబడి “నీకేం కనబడుతున్నది?” అని అడగ్గా, నేను “మరుగుతున్న బాన ఒకటి నాకు కనబడుతున్నది. అది ఉత్తరం వైపుకు తిరిగి ఉంది” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 1:13
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది.


అదే విధంగా నా నోటినుండి నా మాటలు బయలు వెళ్తాయి. అవి సంగతులను సంభవింప చేసేంతవరకు తిరిగి రావు. నేను ఏ సంగతులు సంభవించాలని అనుకొంటానో వాటిని నా మాటలు సంభవింపచేస్తాయి. ఏమి చేయాలని నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా మాటలు సాధిస్తాయి.


“యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు. “నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.


ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు.


ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు!


కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.


“ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు. “ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను.


“నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ