అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము షెకెము ప్రజలమా? మనమెందుకు అతనికి విధేయులవ్వాలి? అబీమెలెకు తనను ఏమనుకొంటున్నాడు? అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు కాడా? అబీమెలెకు జెబూలూను తన అధికారిగా నియమించలేదా? మనము అబీమెలెకునకు విధేయులం కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే హామోరు ప్రజలనే అనుసరించాలి. అని వారితో అన్నాడు. (హామోరు షెకెముకు తండ్రి)
అబీమెలెకు, అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను వెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం వైపు వెనుకకు పరుగెత్తారు. ఆ ద్వారం చేరక ముందే గాలు మనుష్యులు చాలామంది చంపివేయబడ్డారు.