న్యాయాధి 6:6 - పవిత్ర బైబిల్6 మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు. వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”
ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.