న్యాయాధి 5:30 - పవిత్ర బైబిల్30 ‘నిశ్చయంగా వారు గెలిచారు! వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు! వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు! ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు. ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో. అదీ సంగతి! విజయశాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’ အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొనుచున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా? యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా? సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది. రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.’ အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’ အခန်းကိုကြည့်ပါ။ |