Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 4:19 - పవిత్ర బైబిల్

19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఆమె గొంగళితో అతని కప్పగా అతడు–దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 “నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 “నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 4:19
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి త్రాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను.


కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు.


“పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు. కానీ వారికి ఏమీ దొరకవు. వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. నేను వాళ్లను విడువను, చావనివ్వను.


ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు.


సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.


అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.


కనానీయుడైన హెబెరు భార్య యాయేలు. ఆమె స్త్రీలలో దీవెన నొందును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ