Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 20:5 - పవిత్ర బైబిల్

5 కాని రాత్రి సమయాన గిబియా నగరపు నాయకులు నేను నివసించే ఇంటికి వచ్చారు. వారు ఇల్లు చుట్టుముట్టారు. నన్ను కూడాలి అనుకున్నారు. వారు నా దాసిని బలాత్కరించారు. ఆమె చనిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 గిబియాకు చెందినవారు ఆ రాత్రి నా మీద దాడి చేశారు. నేను ఉన్న ఇంటిని చుట్టుముట్టి నన్ను చంపాలని ప్రయత్నించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 20:5
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు.


అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.


మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తొలగించాలి.


మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.’”


ఆ లేవీ వంశపు వ్యక్తి, అతనితో వున్న మనుష్యులు సంతోషంగా వుండగా, ఆ నగరానికి చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారు. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకొని రా. మేమతనితో సంభోగింపదలచాము.”


లేవీ వంశపువాడు, “లే, మనం వెళ్లిపోదాం” అన్నాడు. కాని ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె చనిపోయింది. లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకొని ఇంటికి వెళ్లాడు.


అప్పుడు చంపబడిన ఆ స్త్రీ భర్త వారితో జరిగిన కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నా దాసి, నేనూ బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరమునకు వచ్చాము. మేమారాత్రి అక్కడ గడిపాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ