Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 17:4 - పవిత్ర బైబిల్

4 కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే తీసుకుని, ఆ వెండిని కంసాలి వానికి ఇచ్చింది. వెండి పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా ఇంట్లో ఉంచబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమునుచేయగా అది మీకా యింట ఉంచబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 17:4
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు.


మరో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయోగిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది ఏమీ లేదు.


అతని బూటకపు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు.


“‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’ “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.


మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల వెండిని తిరిగి ఇచ్చివేశాడు. అప్పుడామె అంది, “నేనీ వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాలి. అందువల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీకే ఇస్తాను.”


మీకాకు విగ్రహాలు ఆరాధించే ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారులలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు.


ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ