న్యాయాధి 12:3 - పవిత్ర బైబిల్3 మీరు మాకు సహాయం చేయరని నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయలేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి మీరెందుకు ఈ వేళ వచ్చారు?” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవావారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈ రోజు మీరెందుకు వచ్చారు?” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు సహాయం చేయరని తెలుసుకొని, నేను నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాను. యెహోవా వారి మీద నాకు జయం ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు నాతో పోట్లాడడానికి ఈ రోజు వచ్చారు?” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు సహాయం చేయరని తెలుసుకొని, నేను నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాను. యెహోవా వారి మీద నాకు జయం ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు నాతో పోట్లాడడానికి ఈ రోజు వచ్చారు?” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.