Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 1:3 - పవిత్ర బైబిల్

3 యూదా పురుషులు, వారి సోదరులైన షిమ్యోను వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికి కొంత భూమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మనుష్యులు అంగీకరించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో–మనము కనానీయులతో యుద్ధము చేయుటకు–మా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితోకూడ పోయిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన షిమ్యోను జాతివారితో “మనం కనానీయులతో యుద్ధం చెయ్యడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. షిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్ళారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 1:3
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యెహోవా విని, నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని లేయా చెప్పింది.


యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను.


అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది.


షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి, ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,


కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.


యెహోవా, “యూదా వంశస్థులు వెళతారు. నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.


కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. బెజెకు పట్టణం దగ్గర యూదావారు 10,000 మందిని చంపేసారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ