యెషయా 8:13 - పవిత్ర బైబిల్13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి. အခန်းကိုကြည့်ပါ။ |
నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి మీరు వస్తారు. దేశాన్ని ఆవరించే గర్జించే ఒక మేఘంలా నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం మీద యూద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసుకొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసుకుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!’”
తర్వాత యెహోవా తనకు ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో పదోవంతు, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, గొర్రెల మందలో, మొట్టమొదట పుట్టిన వాటిని మీ దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌరవించటం జ్ఞాపకం ఉంచుకొంటారు.
సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకొని, వాటిని నరికి ముక్కలు చేసి, వాటిని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి, వాటిని ఇశ్రాయేలు నలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. వార్తాహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ “సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు.