యెషయా 65:22 - పవిత్ర బైబిల్22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో నివసించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను నాటగా మరొకడు ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు. వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు. నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరెన్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం చెస్తున్నాను. మీరు తయారు చేసే మీ ద్రాక్షరసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని నేను వాగ్దానం చేస్తున్నాను.