Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 64:9 - పవిత్ర బైబిల్

9 యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, మేము నీ ప్రజలము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద రము నీ ప్రజలమే గదా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 యెహోవా, ఎక్కువగా కోపపడవద్దు. మా పాపాలను ఎప్పుడూ అదే పనిగా గుర్తు పెట్టుకోవద్దు. ఇదిగో, నీ ప్రజలైన మావైపు దయచేసి చూడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 64:9
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.


యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.


యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు. నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.


యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కోపగించి నన్ను శిక్షించవద్దు.


మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.


“నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను.


ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది. కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను. నేను కోపంగా ఉన్నాను గనుక అతని నుండి నేను తిరిగిపోయాను. మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.


ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు. వారి రాజులు నిన్ను సేవిస్తారు. “నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను. కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను. కనుక నేను నిన్ను ఆదరిస్తాను.


నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి. మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.


కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. ఆ ప్రజలు నీ నామం ధరించరు. మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.


“వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు” అని యెహోవా చెప్పాడు. కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.


యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!


యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు: “‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’ ఇది యెహోవా వాక్కు. ‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.’ ఈ వాక్కు యెహోవాది. ‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.


ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.


యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు. ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు. యెరూషలేము కోట గోడలను ఆయన శత్రువులకు అప్పజెప్పాడు. యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు. అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.


సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది. సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.


యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు. నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.


నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.


ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”


మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.


యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను. యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను. అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.


ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.


ఇలాంటి దుర్బోధకులు నీళ్ళు లేని బావుల్లాంటివాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు.


ఇక వాళ్ళను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ