Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 59:9 - పవిత్ర బైబిల్

9 న్యాయం, మంచితనం అంతా పోయింది. చీకటి మాత్రమే మనవద్ద ఉంది. అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి. ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం. కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేముకనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కాబట్టి న్యాయం మాకు దూరంగా ఉంది. నీతి మమ్మల్ని అందుకోవడం లేదు. వెలుగుకోసం మేము కనిపెడుతూ ఉన్నాం గానీ అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం, గానీ అంధకారంలోనే నడుస్తున్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, నీతి మనకు అందడం లేదు. మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, నీతి మనకు అందడం లేదు. మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 59:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు. నా త్రోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.


కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి. వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.


“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వారు గ్రహించరు. వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”


చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.


కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.


మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం. పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం. మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు. మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం, కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.


మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది. న్యాయం దూరంగా నిలుస్తుంది. సత్యం వీధుల్లో పడిపోయింది. మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.


ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.


ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు.


వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.


మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనకు స్తోత్రం చేయండి. యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.


యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.


మనం శాంతిని కోరుకున్నాం; కాని శాంతి కలుగలేదు. స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం, కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.


యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి కాదు.


ప్రవక్తలు, యాజకులు అంధుల్లా వీధుల్లో తిరిగాడారు. వారు రక్తసిక్తమై మలినపడ్డారు. వారు మలినపడిన కారణంగా ఎవ్వరూ వారి బట్టలను కూడ ముట్టరు.


యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు: “ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను. మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.


మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం ఎదురుచూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే యెహోవానుండి ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.


నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు. ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు. మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు? దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?


ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ