Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 59:18 - పవిత్ర బైబిల్

18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు. యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు. కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతి దండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేస్తాడు. ఆయన తన విరోధులను కోపంతో శిక్షిస్తాడు. తన శత్రువులపట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. ద్వీపవాసులను కూడా తగురీతిగా శిక్షిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 వారు చేసిన దానిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తారు తన శత్రువులకు కోపం చూపిస్తారు తన విరోధులకు ప్రతీకారం చేస్తారు; ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 వారు చేసిన దానిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తారు తన శత్రువులకు కోపం చూపిస్తారు తన విరోధులకు ప్రతీకారం చేస్తారు; ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 59:18
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. మనుష్యులకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.


నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది. ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.


ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు.


ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు.


చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు. మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు. వారి జీతం యెహోవా దగ్గర ఉంది.


నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పనిచేశాను. నేను చాలా అలసిపోయాను. కాని ప్రయోజనకరమైనది ఏమీ నేను చేయలేదు. నా శక్తి అంతటిని ఉపయోగించాను. కానీ వాస్తవానికి నేను చేసింది ఏమీ లేదు. కనుక నా విషయం ఏమి చేయాలో యెహోవాయే నిర్ణయించాలి. దేవుడే నా బహుమానం నిర్ణయించాలి.


అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను. నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను. ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.


నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను. నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”


“చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను.


మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”


మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు. కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.


చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. యెహోవా సైన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. యెహోవా కోపంగా ఉన్నప్పుడు, ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు.


వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.


కాని యెహోవానైన నేను ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను. ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.


దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు.


బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు. ఇప్పుడు బబులోను లొంగిపోయింది! దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి! వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి. అది ఇతర దేశాలకు ఏమి చేసిందో, దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి.


“బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి. బబులోను యెహోవాను గౌరవించలేదు. పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది. కావున బబులోనును శిక్షించండి.


యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు. తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు. సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు. ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది.


మీరు చేసిన చెడు కార్యాలకు వారు మిమ్మల్ని శిక్షిస్తారు. హేయమైన మీ విగ్రహాలను ఆరాధించిన నేరానికి మీరు శిక్షింపబడతారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొంటారు.”


నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంపై యుద్ధానికి గోగు వస్తాడు. నేను నా కోపాన్ని చూపిస్తాను.


అప్పుడు మాత్రమే నీ ప్రజల పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు తెలుసు. నేను వారి యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. వారి పట్ల నాకుగల గాఢమైన ప్రేమ వల్ల నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు కుంటారు!”


దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.


“తూరూ! సీదోనూ! ఫిలిష్తీయలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.


అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.


యెహోవా రోషంగల దేవుడు! యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు. యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు. ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.


మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.


ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.


ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం.


ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.


నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా ఖడ్గానికి పదునుపెడ్తాను. నా శత్రువుల్ని శిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష యిస్తాను.


అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు.


మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు.


దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ