Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 57:13 - పవిత్ర బైబిల్

13 మీకు సహాయం అవసరమైనప్పుడు మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి. అయితే, వాటినన్నింటినీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను. ఒక్క గాలి విసురు వాటినన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది. అయితే నా మీద ఆధారపడే వ్యక్తి భూమిని సంపాదించుకొంటాడు. ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధపర్వతమును స్వాధీనపరచుకొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి! వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి. అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 57:13
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు.


గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గాలి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగురగొట్టి వేస్తాడా?


అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.


మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు.


యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.


దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు.


ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు. కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.


మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.


నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.


యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము. దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు, మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.


ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.


కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.


సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.


ఒక స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కాని యెహోవాను సమ్ముకునేవాడు ప్రతిఫలం పొందుతాడు.


అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.


ఆ సైన్యం, వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు ఏమని చెబుతారు? ఫిలిష్తియా ఓడిపోయింది. అని వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బలపర్చాడు. ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి వెళ్లారు.


యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు. అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు. యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు. కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది, కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.


ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు. దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి. గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.


వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది. అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.


“ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.


యెహోవా చెబుతున్నాడు: “సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను. ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను. రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం. ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది, అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత దారులకు ఇచ్చివేస్తారు.


“ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది” అని యెహోవా చెబుతున్నాడు.


“నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు. ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు. నేనే ఆ ప్రజలను చేశాను. నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.


“అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం గూర్చి మరచిపోయిన ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని ఆరాధించే ప్రజలు. మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద ఆధారపడే మనుష్యులు.


తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి. సింహాలు పశువులతో కలిసి మేస్తాయి. నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.” ఇవన్నీ యెహోవా చెప్పాడు.


యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను.


మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు.


ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి? మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!


“యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.


యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది. అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది. ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు. కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి. అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది. నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.


మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు. మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు. ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను! మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను! మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.


నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి.


అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగమంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యం తూర్పార పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.


“మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను. యెరూషలేము పవిత్రం అవుతుంది. పరాయివారు ఆ పట్టణంలోనుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”


కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు, “నేను వారిని పిలిచాను, కాని వారు పలకలేదు. అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే నేను పలకను.


ఆ దేవుళ్లను పూజించటం మీకు ఇష్టం కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్లనే మీకు సహాయం చేయనీయండి.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ