యెషయా 54:1 - పవిత్ర బైబిల్1 ఓ స్త్రీ, సంతోషంగా ఉండు! నీకు పిల్లలు పుట్టలేదు, కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి. “భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది.” అని యెహోవా చెబుతున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తననెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
“ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక క్రొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక క్రొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు – ఒక క్రొత్త దేశానికి — జన్మనిస్తుంది.